శ్లో ॥ బ్రహ్మోవాచ :

అసపిండాశయామాతు రసగోత్రాచయాపితుః సాప్రశస్తాద్విజాతీనాం దారకర్మణిమైథునే

సహజో నభవేద్యస్యానచ విజ్ఞాయతే పితా నోపయచ్ఛేతతాంప్రాజ్ఞః పుత్రికా ధర్మశంకయా

బ్రాహ్మణానాం ప్రశస్తా స్యాత్సవర్ణాదారకర్మణికామశస్తు ప్రవృత్తానామిమాః స్యుః క్రమశోఽవరాః

క్షత్రస్యాపి సవర్ణాస్యాత్పథమా ద్విజసత్తమాఃద్వేచావరే తథాప్రోక్తే కామతస్తు నధర్మతః

వైశ్య స్యైకా వరాప్రోక్తా సవర్ణా చైవ ధర్మతః తథావరాకామతస్తు ద్వితీయా నతుధర్మతః

శూద్రై వ భార్యాశూద్రస్య ధర్మతో మను రబ్రవీత్ చతుర్ణామఫీవర్ణానాం పరిణేతా ద్విజోత్తమః

న బ్రాహ్మణ, క్షత్రియయో రా పద్యపిహి తిష్ఠతో: కస్మింశ్చిదపివృత్తాంతే శూద్రాభార్యోపదిశ్యతే

హీనజాతేస్త్రియం మోహాదుద్వహంతో ద్విజాతయః కులాన్యేవనయంత్యాశు ససంతానాని శూద్రతామ్

శూద్రమారోప్య వేధ్యాంతు పతితోత్రిర్బభూవప ఉతథ్య:పుత్ర జననాత్పతిత త్వమవాప్తవాన్

శూద్రస్య పుత్రమాసాద్య శౌనకః శూద్రతాం గతః భృగ్వాదయోప్యేవమేవ పతితత్వమవాప్నుయుః

తా॥ అసపిండురాలైన (ఏడు తరములనుండి తన వంశమునకుసంబంధింపని) తల్లిగలదియు, తన గోత్రమునకన్నభిన్నమగు గోత్రమునకు సంబంధించిన తండ్రి గలదియైన స్త్రీ బ్రాహ్మణులకు వివాహమునకునుమైధునమునకును ప్రశస్తమైనది. ఏకన్యకు సోదరుఁడు లేడో, తండ్రి ఎవరోతెలియదో అట్టి కన్యను బుద్ధిమంతుఁడు పుత్రికా ధర్మ శంకతో వివాహమాడరాదు. బ్రాహ్మణులకువివాహ విషయమున సవర్ణురాలే ప్రశస్తమైనది: కామ పద్దతిని ప్రవృత్తిగలవారలకుక్రమముననుసరించి కడపటి జాతులవారు ప్రశస్తులు. ఓ బ్రాహ్మణులారా! క్షత్రియునకు కూడా సవర్ణురాలే ప్రాథమ్యము గలది. ధర్మవశమున కాదు కాని కామవశమున బ్రాహ్మణక్షత్రియ లిరువురికినీ వెనుక జాతి స్త్రీలే యోగ్యురాండ్రుగ చెప్పబడినది. ధర్మము ననుసరించి వైశ్యునకును సవర్ణయేశ్రేష్ఠము. కామతః శూద్ర స్త్రీయు. ధర్మతః క్షత్రియ స్త్రీయు కూడదు. ధర్మముననుసరించి శూద్రునికి శూద్ర స్త్రీయేభార్యగా అరురాలని మనువు చెప్పెను. బ్రాహ్మణుఁడు నాలుగు వర్ణముల వారిని వివాహమాడవచ్చును. బ్రహ్మక్షత్రియులిరువురకును.ఎట్టి ఆపత్కాలమున నున్నను, మథియెట్టిపరిస్థితియం దైనను శూద్ర స్త్రీని వివాహమాడుమని ఉపదేశింపబడదు. ద్విజాతులు మోహము వలన హీనజాతి స్త్రీని వివాహమాడిరేనివారు తమ సంతానముతో కూడ సత్వరమే శూద్రత్వమును పొందుదురు. వేదియందు శూద్రునారోపించి అత్రి పతితుఁడయ్యెను. ఉతథ్యుఁడు పుత్ర జననమువలనపతితత్వము పొందెను. శూద్ర పుత్రుని పొంది శౌనకుడు, శూద్రత్వము నందెను. భృగ్వాదులు కూడా ఇదే విధముగ పతితత్వమును పొందిరి.

శ్లో ॥ శూద్రాం శయన మరోప్య బ్రాహ్మణోయాత్యధోగతిమ్జనయిత్వాసుతం తస్యాం బ్రాహ్మణ్యాదేవహీయతే

దైవ పిత్ర్యాతిథేయాని తత్త్ఫధానాని యస్యతు నాదంతిపితరో దేవాః సచస్వర్గంనగచ్ఛతి

వృషలీ ఫేన పీతస్య నిఃశ్వాసోపహతస్యచ తస్యాంచైవప్రసూతస్య నిష్కృతిర్నవిధీయతే

చతుర్ణామపి విప్రేంద్రాః ప్రేత్యేహచ హితాపితమ్సమాసతో బ్రవీమ్యేష వివాహాష్టకముత్తమమ్

బ్రహ్మోదైవస్తథాచార్షః ప్రాజాపత్యస్తథాసురః గంధర్వోరాక్షసశ్చైవ పైశాచ శ్చాష్టమోఽ ధమః

యే యస్యధర్మావర్ణస్య గుణదోషౌచయస్యయౌ శ్రుణుధ్వంతద్ద్విజ శ్రేష్టాః ప్రసవేచ గుణాగుణమ్

ఏప్రస్యచతురః పూర్వాన్ క్షత్రస్య చతురోఽ వరాన్ విట్శూద్రయోస్తు త్రినేవవిద్యాధర్మానరాక్షసాన్

చతురో బ్రాహ్మణస్యాద్యాన్ప్రశస్తాన్కవయో విదుఃరాక్షసం క్షత్రియ స్యై కమాసురం వైశ్యశూద్రయోః

క్షత్రియాణాం త్రయో ధర్మ్యాద్వావ ధర్మ్యౌస్మృతా విహపైశాచశ్చాసురశ్చైవ న కర్తవ్యో కథంచన

పృథక్పృథగ్వా మిశ్రౌవా వివాహ పూర్వచోదితో గాంధర్వోరాక్షసశైవ ధర్యౌక్షత్రస్య తౌ స్మృతౌ

తా ॥ శూద్ర స్త్రీనిశయ్యారోహణ చేయించిన బ్రాహ్మణుడు అధోగతి పొందును. దానితో సంతానము కలిగిన యెడల బ్రాహ్మణ్యమునుండియే చ్యుతిపొందును. దైవ, పితృ, అతిథి సంబంధములైన కర్మలు ప్రథానముగా గలవాఁడట్టి శూద్ర స్త్రీ సంపర్కముకలిగి యుండెనేని అతఁడిచ్చు హవ్య కవ్యములను దేవతలు పితరులు స్వీకరింపరు. అతనికిస్వర్గ ప్రాప్తిలేదు. శూద్ర స్త్రీముఖామృతమును గ్రోలువాఁడు, ఆమెనిఃశ్వాసముతో కొట్టబడువాఁడు, ఆమెయందుసంతానము కనువాఁడు నిష్కృతి లేని వాఁడగునని శాస్త్రము చెప్పుచున్నది. ఓ బ్రాహ్మణోత్తములారా! చాతుర్వర్ణ్యముల వారికిఇహ పరములలో హితాహితములను కల్గించు నెనిమిది విధములైన వివాహములను గూర్చి వివరముగాచెప్పెదను. బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము అనివివాహమష్టవిధములు. ఇందు పైశాచిక వివాహమధమమైనది. ఏ వర్ణము వారికి ఏవి ధర్మములో, ఎవరికి ఏవి గుణ దోషములో, సంతానవిషయమున నేవి గుణగుణములో వానిని చెప్పెదను వినుడు. బ్రాహ్మణునకు మొదటి నాలుగు, క్షత్రియునకు తరువాతి నాలుగు, వైశ్యు శూద్రులకు అరాక్షసములగు మూడు విధముల వివాహములు విహితములనితెలియవలెను. బ్రాహ్మణునకు మొదటినాలుగు, క్షత్రియునకు రాక్షసము, వైశ్య శూద్రులకు ఆసురము ప్రశస్తములని పండితులుచెప్పుదురు. క్షత్రియులకు మూడుపద్ధతులు ధర్మములు, రెండు అధర్మములు, పైశాచము, ఆసురము ఎప్పుడును కూడనివి. గాంధర్వరాక్షసములు రెండును విడిగానైనను కలిపియైనను కతీయువకు దగుగములన పగనుమడియుచేసుఁబడుచుమని.

శ్లో ॥ అచ్ఛాద్య చర్చయిత్వా తు శ్రుత శీలవతే స్వయమ్ ఆహూయదానం కన్యాయాబ్రహ్మోధర్మప్రకీర్తితః

వితతే చాపియజ్ఞేతు కర్మకుర్వతి చార్త్విజి అలంకృత్యసుతాదానం దైవో ధర్మ ఉదాహృతః

ఏకం గోమిధునం ద్వేవా వరాదాదాయ ధర్మతః కన్యాప్రదానం విధివదార్షయో ధర్మ ఉచ్యతే

సహోభౌ చరతం ధర్మమితి వాచానుభాష్యతు కన్యాప్రదానమభ్యర్చ్య ప్రాజాపత్య విధిఃస్మృతః

జ్ఞాతిభ్యో ద్రవిణం దత్వా కన్యాయాశ్చైవ శక్తితః కన్యా ప్రదానం స్వచ్ఛందాదాసురో ధర్మ ఉచ్యతే

ఇచ్ఛయాన్యోన్య సంయోగః కన్యాయాశ్చ వరస్యచ గాంధర్వఃసవిధిర్జ్ఞేయో మైధున్యః కామ సంభవః

హత్వాఛిత్వాచ భిత్వాచ క్రోశం తీం రుదతీం గృహాత్ ప్రసహ్యకన్యా హరణం రాక్షసోవిధిరుచ్యతే

సుప్తాం మత్తాం ప్రమత్తాంచ రహొయాత్రీపగచ్ఛతి సపాపి ష్ఠో వివాహానాంపైశాచః కథితోష్టమ:

జలపూర్వం ద్విజాగ్ర్యాణాం కన్యాదానం ప్రశస్యతేఇతరేషాం తు వర్ణానామితరేతర కామ్యయా

యో యస్యైషాం వివాహానాం విభూనాం కీర్తితో గుణః తంనిబోధత వైవిప్రాః సమ్య క్కీర్తయతో మమ

డిన్నర్లీతో కొవ్వు రాకుండా మీకు ఇష్టమైనవి తినండి. ఇక్కడ నుండి వోచర్ కోడ్‌లను పొందండి https://www.marleyspoonfoodtours.review/dinnerly-promo-code/

తా॥ అధ్యయన సంపన్నుడు, శీల వంతుఁడైన వరుని ఆహ్వానించి, అతనిని ఉత్తరీయాదులతో సత్కరించి, పూజించి స్వయముగా కన్యాదానము చేయుటబ్రాహ్మధర్మమని చెప్పఁబడును. విస్తారమైనయజ్ఞమున ఋత్విక్కుగా కర్మనాచరింపుచున్న వాని నలంకరించి అతనికి కుమార్తెనిచ్చివివాహముచేయుట దైవ వివాహముగా పేర్కొనబడును. ఒకటి లేక రెండు ఆవుల జంటలను వరుని నుండి విధ్యుక్తముగ తీసికొని అతనికికన్యనిచ్చి వివాహముచేయుట ఆర్షమని చెప్పబడును. మిరలిద్దఱు కలిసి గృహస్థ ధర్మమును పాలింపుడు’ అని వాక్కుతో చెప్పి వరునర్చించి కన్యా ప్రదానము చేయుట ప్రాజాపత్యవిధిగాతెలియబడును. కన్య తండ్రి మొదలగువారికిని, కన్యకును యథాశక్తిగాధనాదికములిచ్చి స్వచ్ఛందముగా కన్యను స్వీకరించుట ‘ఆసుర’మని చెప్పబడును. వధూవరుల పరస్పర ప్రేమానుసారముగ నేర్పడు సంయోగముగాంధర్వమని తెలియఁదగును. ఇది యిరువుర కోరికతో సంభవించు కలయిక. ఎదురువచ్చిన వారిని కొట్టుచు మోదుచు నరుకుచు -ఏడ్చుచు ఆక్రోశించుచున్న కన్యను బలాత్కారముగ ఇంటి నుండి అపహరించుకొని పోవుటరాక్షసమని చెప్పబడును. నిదురించుదానిని, మత్తులో నున్న దానిని,మనో వైకల్యముగల దానిని రహస్యముగ ఎత్తుకొని పోవుట పైశాచమని చెప్పబడును.ఈ ఎనిమిదవ వివాహ పద్ధతి పాపిష్ఠమైనది. బ్రాహ్మణులకు ధారాపూర్వకముగ కన్యాదానము చేయుటయే ప్రశస్తవిధి. ఇతర వర్ణములవారికి ఆయా కామ్యములను బట్టి ఆయా వివాహ పద్ధతులు శ్రేష్ఠములు. ఎవరికి ఏయే వివాహ పద్ధతుల మూలమున ఏ గుణము కలదోనేను స్పష్టము చేసెదను. తెలిసికొనుడు.

శ్లో ॥ కులాని దశ పూర్వాణీ తథాన్యాని దశైవతు సహితాన్యాత్మనా చైవ మోచయత్యేనసోధ్రువమ్

బ్రాహ్మీపుత్రః సుకృత కృద్ధైవోఢాజం సుతం శ్రుణుదైవోడాజః సుతో విప్రాః! సప్తసప్తపరావరాన్

ఆర్షోడాజః సుతః స్త్రీణాం పురుషాం స్తారయేద్విజాః!

బ్రాహ్మాదిషు వివాహేషు చతుర్ష్వే దానుపూర్వశఃబ్రహ్మవర్చస్వినః పుత్రాజాయంతే శిష్టసంమతాః

రూపసత్వగుణో పేతా ధనవంతో యశస్వినః పుత్రవంతోఽథ దర్మిష్ఠా జీవంతి చ శతం సమాః

ఇతరేషు నిబోధధ్వం నృశంసానృత వాదినః జాయంతేదుర్వివాహేషు బ్రహ్మధర్మద్విషః సుతా:

అనిందితైః స్త్రీ వివాహైరనింద్యా భవతి ప్రజానిందితైర్నిందితానృణాం తస్మాన్నింద్య్వావర్జయేత్

కరగ్రహణ సంస్కారాః సవర్ణాసుభవంతివై అసవర్ణా స్వయం జ్ఞేయో విధిరుద్వాహ కర్మణి

బాణః క్షత్రియయా గ్రాహ్యః ప్రతో దోవైశ్యకన్యయావసనస్య దశా గ్రాహ్యాశూద్రమోత్కృష్టవేదనే

న కన్యాయాః పితా విద్వాన్గృహ్ణీయాచ్ఛుల్కమణ్వపిగృష్ణన్హి శుల్కంలో భేన సాన్నరోపత్య విక్రయీ

స్త్రీ ధనాని తు యే మోహాదుప జీవంతి బాంధవా ! నారీయానాని వస్త్రం వా తేపాపా యాన్త్యధోగతిమ్

తా॥ బ్రహ్మ వివాహము వలన కలిగిన పుత్రుఁడుపుణ్యమూర్తియై పదితరముల తన పూర్వలను, పదితరములు తరువాతివారిని, తనతరము వారితో సహా నిక్కముగ తరింపఁజేయును. దైవ వివాహము చేసికొనిన స్త్రీ కుమారుని గుఱించి వినుడు. ద్విజులారా !అతఁడు అటు ఏడు తరముల వారిని, ఇటుఏడు తరముల వారిని ఉద్దరింపగలుగును. అర్హవివాహము చేసికొనిన స్త్రీ కుమారుఁడు మూడు మూడు తరముల వారిని తరింపఁజేయును.బ్రాహ్మము మొదలుకొని నాల్గింటిలో ఏ వివాహము చేసికొనిన వారికైనను బ్రహ్మవర్చస్వులు, శిష్టసమ్మతులునైన పుత్రులు జన్మింతురు. వారు రూపము, బలము, గుణము, గలవారై, ధనవంతులు, కీర్తిమంతులు, పుత్రవంతులు, ధర్మిషులునై నూరుసంవత్సరములు జీవింతురు. ఇతరములైన దుర్వివాహముల మూలమున క్రూరులు, అసత్యవాదులు, వేదధర్మదూరులైనవారుజన్మింతురు. నింద్యములైన వివాహమువలననింద్యమైన సంతానమే కలుగును. అనిందిత వివాహము వలన సత్సంతానము కలుగును. కాబట్టినింద్య వివాహ పద్ధతులను విడువవలెను. పాణిగ్రహణ సంస్కారములు సవర్ణులలోనే జరుగును. అసవర్ణ పరిగ్రహము స్వయముగాతెలియవలెను. క్షత్రియ స్త్రీ నుంచేబాణము, వైశ్యకన్యనుంచే మలుగోల, శూద్రకన్యనుంచే వస్త్రము యొక్క అంచు వివాహసమయమునగ్రహింపదగినవి అనునది శ్రేష్ఠుల అనుభవమందలిది. విద్వాంసుడైన కన్యతండ్రి అణుమాత్ర శుల్కమునైనను గ్రహింపరాదు. ఒకవేళ లోభమువలన తీసికొనినచో అతఁడు సంతానము అమ్మినవాఁడగును. బాంధవులెవరైనను మోహవశాత్తుగ స్త్రీధనములనుగాని వాహనములనుగాని, వస్త్రములనుగానీ తీసికొనినచో వారు పాపులైఅధోగతి పాలగుదురు.

శ్లో ॥ ఆర్షే గోమిథునం శుల్కం కేచిదాహుర్మృ షైవ తత్ అల్పోవాపి మహాన్వాపి విక్రయస్తావదేవ సః

యాసాం నా దదతే శుల్కం జ్ఞాతయో నస విక్రయః అర్హణంతత్కుమారీణా మానృశంస్యంచ కేవలమ్

ఇత్థం దారాన్సమాసాద్య దేశమగ్ర్యం సమావ సేత్బ్రాహ్మణో ద్విజశార్దూల య ఇచ్ఛేద్విపులం యశ:

ఋషయ ఊచుః

“కోదేశః పరమో బ్రహ్మన్!కశ్చపుణ్యోమతస్తవ ప్రవసన్యత్ర విప్రేంద్ర! యశః ప్రాప్నోతి కంజజ!?”

బ్రహ్మోవాచ :

“న హీయతే యత్రధర్మచతుష్పాత్సకలోద్విజా: ! సదేశః పరమోవిప్రాః సచపుణ్యోమతోమమ

విద్వద్భిః సేవితో ధర్మోయస్మిన్దేశే ప్రవర్తతేశాస్త్రోక్తశ్చాపి విప్రేంద్రా !! సదేశః పరమోమత:”

ఋషయఊచు :

“విద్వద్భిః సేవితంధర్మంశాస్త్రోక్తం చ సురోత్తమ! వదాస్మాసు సురశ్రేష్ఠ ! కౌతుకం పరమం హీనః”

బ్రహ్మోవాచ :

“విద్వద్భిః సేవితఃసద్భిర్నిత్యమద్వేషరాగిభిః హృదయేనాభ్యసు జ్ఞాతో యో ధర్మస్తం నిబోధత

కామాత్మతా న ప్రశస్తా నవేహాస్యాస్యకామతా కామ్యోవేదాధిగమః కర్మయోగశ్చవైదిక :

సంకల్పాజ్జాయతే కామో యజ్ఞాద్యానిచ సర్వశః వ్రతా నియమధర్మాశ్చ సర్వేసంకల్పజాః స్మృతాః

తా॥ ఆర్ష వివాహమున ఆవులజంటను శుల్కముగా తీసికొనుట కూడ సరికాదని కొందఱందురు. ఏలయన అల్పము తీసికొనినను, అధికము తీసికొనినను అది కన్యావిక్రయమేయగును. కన్యానిమిత్తముగ పరపక్షీయులిచ్చినవస్త్రభూషణాదికములను కన్యతండ్రి, సోదరుడు-అవి-కన్యకే ఇత్తురుగావున-తీసికొనవచ్చును. అది కన్యా విక్రయముగా పరిగణింపఁబడదు. ఇది “కన్యాపూజనమే కాని దోషము కాదు. ఇట్లు “ఉత్తమ వివాహము చేసికొని ఉత్తమ దేశమందు నివసింపవలెను. బ్రాహ్మణుడు విపులమైనకీర్తి నాశించినచో అటుల చేయవలెను. బ్రహ్మదేవునిఈ వాక్యములు.విని ఋషులిట్లనిరి.బ్రహ్మదేవా! ఏ దేశము శ్రేష్ఠమైనది? ఎట్టిదేశము.మీ అభిప్రాయమున-పుణ్యప్రదమైనది? ఎట్టి ప్రదేశమున నివసించుటచేత కీర్తికలుగును? బ్రహ్మ ఇట్లు:సమాధానము చెప్పెను. బ్రాహ్మణోత్తములారా! సకలమైన ధర్మము ,ఎచట నాలుగు పాదములుగా నుండి క్షీణత లేక యుండునోఅది శ్రేష్ఠమైన పుణ్యదేశమని నా ఉద్దేశము. శాస్త్రోక్తమైన ధర్మము. ఏ దేశమున విద్వాంసులచే సేవింపఁబడుచుండునో అది ఉత్తమమైనదేశము. ఋషులు (మరల) ఇట్లనీరీ, “సురశ్రేషా! విద్వాంసులచేత సేవింపబడు శాస్తోకధర్మమెట్టిదో మాకు చెప్పుడు. వినుటకు కుతూహలముగానున్నది”.బ్రహ్మ ఇట్లు చెప్పెను. రాగద్వేష రహితులైన సత్పురుషులు, విద్వాంసులు తమ హృదయముతో ఆదేశింపబడి సేవించుధర్మమెట్టిదో తెలిసికొనుడు. కోరికకలిగి ఉండుట ప్రశస్తముకాదు. కాని దానికి కూడ అకామతలేదు కదా! వేదాధ్యయనము. వైదికకర్మయోగము కూడ కామ్యమే. సంకల్పమునుండియే కామన జనించును. యజ్ఞాదులు, నియమములు, ధర్మములుగల వ్రతములు అన్నియును సంకల్పమువలనకలిగినవే.

శ్లో ॥ కామాదృతే క్రియాజారీ దృశ్యతే సేనేహ కర్హిచిత్యద్యద్ధి కురుతేః కశ్చిత్తత్త త్కామస్యచేష్టితమ్

నిగమో ధర్మమూలం స్యాత్స్మతిశీలే తథైవచ తథాచారశ్చసాధూనామాత్మనస్తుష్టిరేవచ

సర్వంతు సమవేక్షేత నిశ్చయం జ్ఞాన చక్షుషాః శ్రుతి ప్రాథాన్యతోవిద్వాన్ స్వధర్మే నివసేతవై

శ్రుతి స్మృత్యుదితం ధర్మమను తిష్ఠన్సదా నరఃప్రాప్యతేహపరాం’కీర్తిం యాతిశక్రసలోకతామ్

శ్రుతిస్తు వేదో విజ్ఞేయో ధర్మశాస్త్రంతువై స్మృతిఃతేసర్వార్ధేషు మీమాంస్యేతాభ్యాం ధర్మోహి నిర్బభౌ

యోఽవమన్యేతతే చోభే హేతుశాస్త్రాశ్రయాబ్ద్విజః స సాధుభిర్బహిష్కార్యో నాస్తికోవేదనిందకః

వేదః స్మృతిః సదాచారః స్వస్యచప్రియమాత్మనఃఏతచ్చతుర్విధం విప్రాః! సాక్షాద్ధర్మస్యలక్షణమ్

ధర్మజ్ఞానం భవేద్విప్రా అర్థకామేష్వసజ్జతామ్ధర్మజిజ్ఞాసమానానాం ప్రమాణాన్నైగమం పరమ్

నిషేకాదిశ్మశానాంతో మంత్రైర్యస్యోదితో విధిః అధికారోభవేత్తస్య వేదేషుచ జపేషుచ

సరస్వతీ దృషద్వత్యోర్దేవనద్యోర్యదంతరమ్ తదేవనిర్మితం దేశం బ్రహ్మవర్తం ప్రచక్షతే

తా ॥ కామనలేని క్రియాకారిత్వమెచ్చటను కనుపింపదు. ఏది చేసినను అది కామ చేష్టితమే యగును. శ్రుతి, స్మృతి శీలములు, ఆచారము, ఆత్మసంతుష్టి అనునవియే సత్పురుషులకుధర్మమూలములు. విద్వాంసుఁడు జ్ఞానచక్షువుతో అంతయును పరిశీలింపవలెను. శ్రుతి ప్రధానముగ స్వధర్మమున నుండవలెను. మానవుఁడెల్లవేళల శ్రుతి స్మృతులలో చెప్పఁ బడినధర్మము ననుష్ఠించుచు ఇహపరములయందు కీర్తినంది స్వర్గమును పొందును. శ్రుతిని వేదముగాను, ధర్మశాస్త్రమును స్మృతిగను తెలియవలెను. అవి అన్ని ప్రయోజనములందువివేచింపఁదగినవి. వానినుండియే ధర్మము ప్రకాశితమైనది. ఎవడు హేతుశాస్త్రమునాశ్రయించి వానిని (శ్రుతిస్మృతులను) అవమానించునో వాడువేదనిందకుడు. నాస్తికుడు. సజ్జనులచేత బహిష్కరింపదగినవాడు.వేదము, స్మృతి, సదాచారము, తనకు ప్రియమైనది అను ఈ నాలుగు కలిసి సాక్షాత్తుగ ధర్మలక్షణమగుచున్నది. విప్రులారా ! అర్థకామసాధనలందు ధర్మజ్ఞానమొకరక్షణ కవచమగుచున్నది. ధర్మజిజ్ఞాసువులకు వేదమే పరమప్రమాణము. ఎవనికి మంత్రముల ద్వారా ని షేకము మొదలుకొనిశ్మశాన పర్యంతము సంస్కారవిధి చెప్పఁ బడినదో వానికే వేదమునందు, జపమునందు, అధికారము కలదు. సరస్వతి, “దృషద్వతి అనుదేవనదుల మధ్యన గల ప్రదేశము ‘బ్రహ్మావర్త’మని పిలువఁబడును.

శ్లో ॥ యస్మిన్ దేశే య ఆచారః పారంపర్యక్రమాగతః వర్ణానాం సాంతరాలానాంస సదాచార ఉచ్యతే

కురుక్షేత్రంచ మత్స్యాశ్చ పంచాలాః శూర సేనయః ఏషబ్రహ్మర్షి దేశోవై బ్రహ్మావర్తాదనంతరమ్

ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్ర జన్మనః స్వంస్వంచరిత్రంశిక్షంతి పృథివ్యాం సర్వమానవాః

హిమవద్వింధ్య యోర్మధ్యే యత్ర్పాగ్వినశనాదపిప్రత్యగేవ ప్రయాగాచ్చ మధ్యదేశః ప్రకీర్తితః

ఆసముద్రాత్రువై పూర్వాదాసముద్రాత్తు పశ్చిమాత్తయోరేవాంతరం గిర్యోరార్యావర్తం విదుర్బుధాః

అటతే యత్ర కృష్ణాగౌర్మృగో నిత్యం స్వభావతః సజ్ఞేయోయాజ్ఞికోదేశో మ్లేచ్ఛదేశస్త్వతః పరః

ఏతాన్నిత్యం శుభాన్ దేశాస్సంశ్రయేత ద్విజోత్తమఃయస్మిన్క స్మింశ్చనివసేత్పాదజో వృత్తి కర్శితః

ప్రకీర్తితేయం ధర్మస్య బుధైర్యోనిర్ద్విజోత్తమాఃసంభవశ్చాస్యసర్వస్య సమాసాన్నతు విస్తరాత్

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే శతార్థసాహస్ర్యాంసంహితాయాం బ్రహ్మే పర్వణి

వివాహధర్మవర్ణనం నామ సప్తమాఽధ్యాయ:

తా॥ ఏదేశమున ఏ ఆచారమువర్ణోపవర్ణములవారికి పారంపర్య క్రమమున వచ్చుచున్నదో అది వారికి సదాచారమని చెప్పబడును. కురుక్షేత్రము, మత్స్యదేశములు, పాంచాలములు, శూరసేనదేశములు కలిసి బ్రహ్మర్షిదేశము. ఇదిబ్రహ్మావర్తము తరువాతిది. ఈ దేశమునజన్మించిన బ్రాహ్మణులనుండియే అన్నిదేశములవారు తమతమ ఆచారములను నేర్చుకొందురు. హిమాలయము, వింధ్య పర్వతముల మధ్య వినశనకు కురుక్షేత్రమునకుతూర్పున ప్రయాగకు పశ్చిమమున గల ప్రదేశము పశ్చిమ సముద్రము వఱకు గల దేశమునుఆర్యావర్తముగా పండితులు గుర్తింతురు. ఎచట కృష్ణసారమృగము స్వాభావికముగా ఎప్పుడును తిరుగాడుచుండునో అది యాజ్ఞికదేశము. ఆ తరువాత గలది మేచ్ఛదేశము. బ్రాహ్మణుఁడువీనిలో శుభదేశములనాశ్రయించి యుండవలెను. శూద్రుడు తన వృత్తిని బట్టి ఏ దేశముననైననివసింపవచ్చును. మునీశ్వరులారా!ఇట్లు విద్వన్మూలమైన ధర్మ సర్వస్వమును విస్తరించికాక సంక్షేపముగాఁ జెప్పితిని.

ఇదిశ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున వివాహ ధర్మవర్ణనమను ఏడవ అధ్యాయము.